Friday, July 30, 2010

ప్రేమ బాధ


ప్రేమయినా దోమయినా
కుట్టాలీ ఏడవాలి.
దోమ బాధలు చాలా రకాలుగా ఉండొచ్చేమో కానీ
ప్రేమ బాధ ఒకే పోటు పొడుస్తుంది.
కృష్ణ శాస్త్రి బాధ ప్రపంచానికి బాధ,
ప్రపంచం బాధ శ్రీ శ్రీ బాధ!

(పాతగా ఉంది కదా, ఇంత కన్నా గొప్పది లేదు ...పోలిక )
నీతో నా దోమ బాధలు నాకు ఉండగానే
ఇలా ప్రేమించు , అలా ప్రేమించు అంటూ
చలం
గోల పెడుతున్నాడు
అందులో ఆయన తప్పేమీ లేదు
మరి ఆ రోజుల్లో... అంత బూస్టప్ ఉంటే తప్ప
బావిలో కప్పలు బయట పడేవి కాదు.
ఇప్పుడయినా, మన స్విమ్మింగ్ ఫూల్సుల్లో మనం
విశాల హృదయాలతో ఫూల్స్ అవుతూనే ఉన్నాం కదా
ఇందులో మన తప్పు కూడా ఏమీ లేదు
మనం పుట్టిన చోట ప్రేమ సముద్రాలు లేవు మరి!
నడినెత్తిన సూర్యుడు మండిపోతుంటే..
గోరు వెచ్చని ఊహల కోసం తహ తహ లాడలేము కదా
...సూర్యుడి నెత్తిన వర్షం ముసురు ముసుగు కప్పినప్పుడు...
నులివెచ్చని తలపుల తోటకు తలుపులు తెరుచుకుంటాయి ...
వర్షం తోటలో ముందు దోమ కుడుతూంది తర్వాత ప్రేమ కుడుతూంది...
... బాధ ...
ఇది శాస్త్రి గారి బాధ కాదు శ్రీ శ్రీ బాధాకాదు
చలం బాధ అంతకన్నా కాదు
ఇది ఇక మన బాధ
మనిద్దరి ప్రేమ బాధ!
నువ్వున్నావని తెలియడమే నాకు బాధ
నేనున్నానని తెలియక పోవడమే నీకు తెలిసీ తెలియని బాధ

కలలో నువ్వు ఎదురయినప్పుడు...
నిన్ను గిల్లో, గిచ్చో నా ఉనికి నిజమని నీకు తెలుపకపోవడం
నా తప్పే !
నీ జంటన తున్టరినై , అంతలోనే ఒంటరినై ....
సమ శీతోష్ణ స్థితే ప్రేమకు చక్కని స్థలమని....
సూర్య, చంద్రులను కళ్ళు చేసుకుని,
ఆ వేల వెలుగులతో పగలూ, రాత్రుల హద్దులు మరచి
వెచ్చని ఊహల ముసుగు కప్పుకుని,
నీ కోసం ఎదురుచూస్తున్నాను................

Friday, July 23, 2010

between humans...


మనిషి...
మనుష్యులు.... కలిస్తే మనం...!
అనుకుంటాం మనల్ని 'మనం'
ఈ మనం ఒకేలా ఉంటాం
శరీరాలు...ఒకేలా ఫంక్షన్ అవుతాయి
విషయాలు ఎన్నున్నా ఎలా ఉన్నా,
మన మైండ్ లు కూడా ఒకేలా పని చేస్తాయి
రక రకాలుగానే అయినా ,
ఒకరు చేసినవే మరొకరం...
ఎన్నో పనులను చేస్తాం.
ఇన్ని సాధ్యమవుతున్నా
ప్రేమ మాత్రం ఎందుకు సాధ్యం కాదు?
మనుష్యుల హృదయాలు ... ఒకటి కావా
బాధలూ , కోపాలూ , తాపాలు
గుండెలను ఒకేలా గుచ్చవా
మనం ఒకేలా ఏడుస్తాం (ఎలా ఏడ్చినా ఏడుపు ఒక్కటేగా )
ఒకేలా నవ్వుతాం , కానీ
ఒకేలా ఎందుకు ప్రేమించుకోలెం ?
మనిద్దరం ... ఇద్దరం మనుష్యులమే కదా!
నువ్వైనా నేనైనా
నేనైనా నువ్వైనా ,
నువ్వు నేనైనా
నేను నువ్వైనా
హృదయం ఒక్కటే కదా...
వేర్పాటు వాదాలు ఎన్నున్నా
మది గది సిద్హాంతం( ? )... మనదే కదా....
( ఈ 'నువ్వు' ఎవరని అడక్కండి ... సీక్రెట్! )

Thursday, July 22, 2010

దోబూచులాటేలరా

రానా...,
రా..నా..
అంటూ
ఆకాశం మాటున...
నీలి గాలుల వెనుక నీ రూపం
నా మనసుతో దోబూచులాడుతోంది
ఇలలో కాకున్నా కలలో అయినా
కంటి నిండా కనిపించ వచ్చుగా
ఇనుప తలుపుల వెనుక నీవూ
ముళ్ళ
కంచెల నడుమ నేనూ...
...ఎప్పుడైనా నువ్విటువైపు వస్తే ...
వస్తే....
నీకు కనిపించాలని ఉన్నచోటనే అందమైన పువ్వై పూచాను
నువ్వు నా దగ్గరకు వచ్చేటప్పుడు...
ఈ ముళ్ళు నీకు గుచ్చ్చుకోకూడదని
నా సుతి మెత్తని పూరేకుల అరచేతులను పరచి వేచి ఉన్నాను
గాలి... నువ్వొచ్చే పరిమళ సంకేతాలను మోసుకొస్తుందేమోనని
నిదురించే రెప్పల వెనుక కూడా స్వప్నాన్నై ఎదురు చూస్తున్నాను....
రానా..., రానా అని కాదు వచ్చెయ్యి ప్రియా

Wednesday, July 21, 2010

నేను - ప్రేమ

ప్రేమతో,
ప్రేమతో నేను...
ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటాను
అది నా నిత్య జీవితపు భాగస్వామి
నా మనసుకు ఊపిరానివ్వని ఊహల ఊసులను నూరిపోస్తున్ది
హృదయానికి తీయని తలంపుల పరమాన్నం పెట్టి పోషిస్తుంది
తనువును పులకింతల పూవులతో మైమరపిస్తుంది
చందమామ కథల నుంచీ చంద్రయాన ప్రయోగాల వరకూ...
ఎప్పుడూ నన్ను వెంటాడుతూనే ఉంది.
అల్లి బిల్లి అమాయకత్వంలోను
కన్నీటి కలతలలోనూ,
అజ్ఞానపు అందములోనూ
విజ్ఞానపు వేదికలోనూ
నన్ను వేటాడుతూనే ఉంది!
నా తొలి వేకువతోనూ ముని మాపుతోనూ దానికి సంబంధం లేదు
మనసుకు... వయసు రెక్కలు మొలవకుండా తన బానిసగా నన్ను...
భూమ్యాకాశాల నడుమ భద్రపరచుకుంది!
ఆ విశాలాకాశపు నేల మీద...
వసంతాలు వస్తున్నాయి, చెట్లు పూస్తున్నాయి, కాయలు కాస్తున్నాయి
కానీ, ప్రేమ చెట్టు కొమ్మన... నన్నెప్పుడూ వసి వాడని పసి మొగ్గను చేసి,
తీరని దాహాల దారాలతో ముడేసుకుంది.
ముడి వీడని ఆ బంధాలతో...
నన్ను నేను ప్రేమించుకుంటున్నాను
ప్రకృతిని ప్రేమించుకుంటున్నాను
ప్రపంచాన్ని ప్రేమించుకుంటున్నాను
ప్రేమను ప్రేమించుకుంటున్నాను...
.............
ప్రేమతో ప్రేమను ప్రేమిస్తున్నాను...