Friday, September 2, 2011

ఉన్నాను నీకు తోడుగా...


ఉన్నాను నీకు తోడుగా ఒక్కొక్క మధుర క్షణం 
మరణ వేళ సైతం మరువలేని కావ్యమిది
తున్నూరు నిముషాలే తోడు ఉన్నకాలంలో 
ఎన్నో నిముషాలు హృదయం కదిలించినవి
పరువంతో తొలి నిముషం
భయంతో చెరు నిముషం
కట్టుబడి కౌగిలికి కన్నీరైన క్షణం
ఇంగితమే మతి తప్పి, ఎన్నో సొగసుల్లో
ముద్దులనే మురిపించి మోహంలో చలి నిముషం...
ఉన్నాను నీకు తోడుగా ఒక్కొక్క మధుర క్షణం
మరణ వేళ సైతం మరువలేని కావ్యమిది
ఏ న్యాయం ఏ పాపం, ఇరువురికీ తోచవులే
అతి చొరవా అతి వగలా? అభిప్రాయాలెరుగవులే
ఏది చివరా ఏది మొదలు, ఉరవడిలో తోచదులే
ఇరువురమై ఆరంభించాం, ఎవరైతేనేమిటిలే
లజ్జనే తొలగించా, ఆశల్ని నీలో సృజించా
అడ్డే తొలగే, నీ బిడియాలే అందాలాయే 
గతం లే, గతకాలం లాగా మరుగవు దృశ్యం 
ఆరనిదీ ఎదల కన్నీరు ఆరదులే ఈ జంట తడి
ఉన్నాను నీకు తోడుగా ఒక్కొక్క మధుర క్షణం
మరణ వేళ సైతం మరువలేని కావ్యమిది
ఉన్నాను నీకు, తోడుగా... , ఒక్కోక్క... మధుర... క్షణం
మరణ వేళ సైతం మరువలేని కావ్యమిది!

ఉన్నాను నీకు తోడుగా ఒక్కొక్క మధుర క్షణం...
నీ ఉన్నత, అగాథాల స్థితుల యందు...
ఆకలి దప్పుల, ఉత్సవ పరిస్థితుల యందు...
ఉన్నాను నీకు తోడుగా!

క్షణ, క్షణపు ప్రణయ సమక్షముల యందు...
సుదూర నిర్దయపు విరహముల యందు...
ఉన్నాను నీకు తోడుగా!

చీకటి గది కౌగిలిల యందు...
విశాల ఆకాశపు ఆలింగనముల యందు...
ఉన్నాను నీకు తోడుగా!

చిరు నవ్వుల పరదాల ముందు...
నక్షత్రాలను జ్వలించే కోపాగ్ని కీలల యందు...
ఉన్నాను నీకు తోడుగా!

ఆట యందు, వేట యందు...
పాట యందు, పరవశమందు...
ఉన్నాను నీకు తోడుగా!

నువ్వు నాతో ఉన్నప్పుడు, లేనప్పుడూ
ప్రతి క్షణం నీ కోసమే... ఉన్నాను నీకు తోడుగా
ఒక్కొక్క మధుర క్షణం...
మరణ వేళ సైతం మరువలేని.., కావ్యమిది!
కడ కొంగుతో నీ నుదిటి చిరు చెమటను తుడిచేందుకు...
ఉన్నాను నీకు తోడుగా ఒక్కొక్క మధుర క్షణం
ఉన్నాను నీకు...తోడుగా, ఒక్కొక్క... మధుర...క్షణం!

{... మిడ్డీలు, చెడ్డీలు వేసుకున్నప్పుడు ఎలాగూ కడ కొంగు భాగ్యం ఉండదు కదా అని,  అందంగా చీర కట్టుకుని (ఎంత గజి, బిజీగా - ఇబ్బందిగా ఉన్నా) అతని కోసం ఎదురు చూసిన ప్రతిసారీ.., నన్ను నిరాశ పరచినా...ఆ క్షణం లోనూ.., ఉన్నాను నీకు తోడుగా...నేను ఒంటరిగా...!...అంటూ...నా ప్రియ సఖునికి అంకితమిస్తున్నాను... నా ప్రేమ కావ్యాన్ని! ... మరి, మరణ వేళ సైతం...మరువలేని కావ్యమిది!...} As a Lover...

{{... ఎందుకు boys girlsని వదిలిపెట్టి తిరుగుతారో అర్థం కాదు!
వాళ్ళంతకు వాళ్లు బయట తిరిగితే... అది స్త్రీలతో సహజీవనం చేసినట్లా?!
సహా నిశాచారం తప్ప సహా జీవన మాధుర్యం తెలియని వాళ్లతో... 
సహజీవన ఒప్పందాలు (వివాహం etcలు) ఏర్పాటు చేయడం...,
...ఓడిపోయిన విధానాలను పట్టుకుని కూచున్న సమాజం యొక్క, వెనుకబాటుతనాన్ని సూచిస్తోంది! ...}} - As a Sociologist...