Wednesday, March 16, 2011

వేమన్న విరహం!

తుంట వింటి వాని తూపుల ఘాతకు 
మింటి మంటి నడుమ మిడుక తరమె?
ఇంటి యాలి విడిచి యెట్లుండవచ్చురా
విశ్వదాభిరామ వినుర వేమ.
                 ......విరహం గురించి వేమన చెప్పిన పద్యమిది! 

మింటి - మంటి నడుమ...
అంటే, భూమి - ఆకాశాల నడుమ ప్రేమ రగిలించే 
విరహం కన్నా... గొప్ప బాధ ఇంకోటి లేదని వేమన చెబుతున్నాడు. 
ప్రేమికుడిగా జీవితాన్ని మొదలు పెట్టిన వేమన...
విరహం నుంచే విరాగిగా మారిన వాడు.
కనుకనే అదెంత బాధాకరమో చెప్పగలిగాడు.  

స్త్రీ, పురుష సంబంధాలను గురించి
వేమన్న అభిప్రాయాలను చూస్తే...
అవి మానవ జీవన ప్రయాణంలో...
పలు దశలుగా ఆయన భావించినట్లు ఉంది.
అవి తన స్వంత విషయాలుగా ఆయన చెప్పకున్నా,
జన పదుల కథల్లో మాత్రం ఆయనే నాయకుడు. 

.....చెరుకు విల్లు లోంచి మన్మథుడు వదిలే 
బాణాల దెబ్బకు కలిగే మోహం ఇంతింత కాదు...
ఆ విరహ వేదనకు పైన ఆకాశం, కింద భూమి సాక్షం!
ఎవరికోసమీ బాధ?
ప్రేయసి కోసమేగా!

కానీ, ఇక్కడ వేమన్న 'ఇంటియాలి విడిచి' అంటాడు
అంటే, అప్పటికే వేమన్న పెళ్లి చేసుకుని గృహస్థుడయ్యాడని, 
జానపదుల వాడుక కథ.
ఇలా వేమన్న ఇల్లాలి కోసం భర్త పడే విరహ వేదనను వివరించాడు.
ఏం, ఎప్పుడూ ఇంట్లో ఉండే భార్య ఇంట్లో లేదా?
బహుశా పుట్టింటికి వెళ్లిన్దేమో?
బంధువుల పెళ్లికి వెళ్లిన్దేమో?
గుడికో, నీళ్ల కోసం చెరువుకో, ఏ పేరంటానికో వెళ్లిన్దేమో?
ఆమె వచ్చే లోగా ఆయన మన్మథుడి బాణాలు తగిలి ఇల్లాలి కోసం 
విరహ వేదన చెందుతూ...
ఆమెను వదిలి ఎలా ఉండటం? 
విరహమంతటి దుర్భర బాధ లేదని, 
భూమ్యాకాశాల నడుమ విరహాన్ని ఓర్చుకునే పరిస్థితి లేదని అంటున్నాడు!

ఇదే విరహాన్ని వేమన్న పలు సందర్భాల్లో స్త్రీలకు కూడా వర్తింప చేశాడు.
...స్త్రీలు కూడా మనుష్యులేనని, 
వారు వస్తువులు కాదని,
వారికీ రక్త, మాంసాలున్న శరీరాలున్నాయని,
వాటిలో హృదయాలున్నాయనీ,
స్త్రీ మనసులోనూ కోరికలుంటాయనీ, 
విరహం వారిని కూడా వేధిస్తుందని... 
ఆ మహా కవి, ఆ సామాజిక వేత్త... 
ఏనాడో స్త్రీల పట్ల...తన సహానుభూతిని చూపాడు.

గమనిక: భర్తలతో సయోధ్య లేని భార్యల గురించి అనేక పద్యాలు చెప్పాడు వేమన్న.
అలాగే వేశ్యా జీవితాలను గురించి కూడా చెప్పాడు. 
కానీ ఎక్కడా ఆయన ఆ వ్యవస్థను సమర్థించిన దాఖలాలు లేవు.
స్త్రీ, పురుషుల మధ్య విరహం ఉంటే...
అది అన్యోన్య జీవితమని ఆయన అభిప్రాయం.
ఇక, అది ఒక అన్యోన్య సమాజానికి నాంది అన్నది ఒప్పుకో తగినదే. 

కానీ ఇప్పటికీ ఈ ఆధునిక యుగంలో స్త్రీని, 
ఒక నడిచే బొమ్మగా చూసే వాళ్లే ఎక్కువగా ఉండడం...
ఒక సామాజిక, సామూహిక వ్యాధి!  
(ఆచార్య ఎన్. గోపి - వేమన్న వెలుగులు - inspirationతో...)  

3 comments:

 1. YOGI vemannanu tesukochhi with love lo padeshare!
  viraham gurinchi vemanna cheppindi neti societyki ento avasaram anipistondi.
  ఆధునిక యుగంలో స్త్రీని,
  ఒక నడిచే బొమ్మగా చూసే వాళ్లే ఎక్కువగా ఉండడం...
  ఒక సామాజిక, సామూహిక వ్యాధి!
  ilaanti vyadhi grastulunna e societylo...అన్యోన్య జీవితం...అన్యోన్య సమాజం oka teerani kala...kadantara?

  kane jaivikavasaraala gurinchi pramukhulu prastavinchina vishayaalanu veliki teyadam...rayadam...manchi prayatnam!
  Thanks.

  ReplyDelete
 2. @మీ విశ్లేషణ బాగుంది....ఎవరన్నారు స్త్రీ కి కోరికలు ఉండవని....?
  దేహవాంచ లేని దేహం ఉంటుందా........?స్త్రీ కోరిక నారికేళపాకం అని కృష్ణుడు చెప్పాడు..పైన డొప్ప,తర్వాత పీచు,ఆ లోపల టెంక,ఇంకా లోపల కొబ్బర,ఆ లోపల స్వచమైన కోరిక.....

  ReplyDelete
 3. మీరు నానానికి ఒకవైపే ఆలోచిస్తున్నారు... స్రీకూడా మోసం చేస్తుంది... ప్రేమ అంటుంది.. నీవంటే ఇష్టం అంటుంది చివరకు తనదారి తను చూసుకొంటుంది..కారనాలు ఏవైనా ..ఇష్టపడ్డ మనిషి కష్టపడుతున్నా చివరకు చనిపోతాడు అని తెల్సినా తన సుఖం చూసుకోని వదిలివేసే అమ్మాయిలూ ఉన్నారు ..తను అనుకున్నదానికోసం ఆడదానిలా ఏడ్చే ఎదవ నాకొడుకులూ ఉన్నారు అలాంటీ వాళ్ళనే నమ్ముతున్నాను అమ్మాయిలు ..నిజం తెల్సుకోలేనంతా గా ఎందుకిలా మారుతున్నారు...ప్లీజ్ మార్చుకోండీ మీ డెషిషన్ మార్చుకోండీ ప్లీజ్..నాలో విరహాన్ని రేపి..తనంటే ప్రాణం అనుకున్న క్షనాన మరొకరితో ఎంజాయ్ చేస్తూ.. నన్నో పిచ్చి వాడిక్రింద లెక్కకట్టిన ఆమెను ఏం అనాలు ...ఏమో వద్దు ఏం అనొద్దు అమె ఎక్కడ ఉన్నా హేపీగా ఉండాలి

  ReplyDelete