Friday, September 2, 2011

ఉన్నాను నీకు తోడుగా...


ఉన్నాను నీకు తోడుగా ఒక్కొక్క మధుర క్షణం 
మరణ వేళ సైతం మరువలేని కావ్యమిది
తున్నూరు నిముషాలే తోడు ఉన్నకాలంలో 
ఎన్నో నిముషాలు హృదయం కదిలించినవి
పరువంతో తొలి నిముషం
భయంతో చెరు నిముషం
కట్టుబడి కౌగిలికి కన్నీరైన క్షణం
ఇంగితమే మతి తప్పి, ఎన్నో సొగసుల్లో
ముద్దులనే మురిపించి మోహంలో చలి నిముషం...
ఉన్నాను నీకు తోడుగా ఒక్కొక్క మధుర క్షణం
మరణ వేళ సైతం మరువలేని కావ్యమిది
ఏ న్యాయం ఏ పాపం, ఇరువురికీ తోచవులే
అతి చొరవా అతి వగలా? అభిప్రాయాలెరుగవులే
ఏది చివరా ఏది మొదలు, ఉరవడిలో తోచదులే
ఇరువురమై ఆరంభించాం, ఎవరైతేనేమిటిలే
లజ్జనే తొలగించా, ఆశల్ని నీలో సృజించా
అడ్డే తొలగే, నీ బిడియాలే అందాలాయే 
గతం లే, గతకాలం లాగా మరుగవు దృశ్యం 
ఆరనిదీ ఎదల కన్నీరు ఆరదులే ఈ జంట తడి
ఉన్నాను నీకు తోడుగా ఒక్కొక్క మధుర క్షణం
మరణ వేళ సైతం మరువలేని కావ్యమిది
ఉన్నాను నీకు, తోడుగా... , ఒక్కోక్క... మధుర... క్షణం
మరణ వేళ సైతం మరువలేని కావ్యమిది!

ఉన్నాను నీకు తోడుగా ఒక్కొక్క మధుర క్షణం...
నీ ఉన్నత, అగాథాల స్థితుల యందు...
ఆకలి దప్పుల, ఉత్సవ పరిస్థితుల యందు...
ఉన్నాను నీకు తోడుగా!

క్షణ, క్షణపు ప్రణయ సమక్షముల యందు...
సుదూర నిర్దయపు విరహముల యందు...
ఉన్నాను నీకు తోడుగా!

చీకటి గది కౌగిలిల యందు...
విశాల ఆకాశపు ఆలింగనముల యందు...
ఉన్నాను నీకు తోడుగా!

చిరు నవ్వుల పరదాల ముందు...
నక్షత్రాలను జ్వలించే కోపాగ్ని కీలల యందు...
ఉన్నాను నీకు తోడుగా!

ఆట యందు, వేట యందు...
పాట యందు, పరవశమందు...
ఉన్నాను నీకు తోడుగా!

నువ్వు నాతో ఉన్నప్పుడు, లేనప్పుడూ
ప్రతి క్షణం నీ కోసమే... ఉన్నాను నీకు తోడుగా
ఒక్కొక్క మధుర క్షణం...
మరణ వేళ సైతం మరువలేని.., కావ్యమిది!
కడ కొంగుతో నీ నుదిటి చిరు చెమటను తుడిచేందుకు...
ఉన్నాను నీకు తోడుగా ఒక్కొక్క మధుర క్షణం
ఉన్నాను నీకు...తోడుగా, ఒక్కొక్క... మధుర...క్షణం!

{... మిడ్డీలు, చెడ్డీలు వేసుకున్నప్పుడు ఎలాగూ కడ కొంగు భాగ్యం ఉండదు కదా అని,  అందంగా చీర కట్టుకుని (ఎంత గజి, బిజీగా - ఇబ్బందిగా ఉన్నా) అతని కోసం ఎదురు చూసిన ప్రతిసారీ.., నన్ను నిరాశ పరచినా...ఆ క్షణం లోనూ.., ఉన్నాను నీకు తోడుగా...నేను ఒంటరిగా...!...అంటూ...నా ప్రియ సఖునికి అంకితమిస్తున్నాను... నా ప్రేమ కావ్యాన్ని! ... మరి, మరణ వేళ సైతం...మరువలేని కావ్యమిది!...} As a Lover...

{{... ఎందుకు boys girlsని వదిలిపెట్టి తిరుగుతారో అర్థం కాదు!
వాళ్ళంతకు వాళ్లు బయట తిరిగితే... అది స్త్రీలతో సహజీవనం చేసినట్లా?!
సహా నిశాచారం తప్ప సహా జీవన మాధుర్యం తెలియని వాళ్లతో... 
సహజీవన ఒప్పందాలు (వివాహం etcలు) ఏర్పాటు చేయడం...,
...ఓడిపోయిన విధానాలను పట్టుకుని కూచున్న సమాజం యొక్క, వెనుకబాటుతనాన్ని సూచిస్తోంది! ...}} - As a Sociologist...

5 comments:

  1. కొందరు అంటారు వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు అని పరిస్థ్జితులు అలా మారుస్తాయి అని..మీ విషయంలో ఇలా జరిగింది నావిషయంలో రివర్స్...మీరు అన్నారు ఎందుకు అబ్బాయిలు అమ్మాయిలను వదలి పెడతారు అని వదిలిపెట్టి తిరుగుతారో అర్థం కాదు! అని అది మీకు జరిగింది నాకు రివర్స్ జరిగింది నేను చాలానమ్మాను ఆమెను..తనే లోకం అనుకున్నా ఇప్పటికీ తనంటే ప్రానం...నాకు కష్టం అయినా తను సంతోహం గా ఉండాలని కోరుకున్నా తన సంతోషంకోసం నాకిష్టంలేకున్నా కాంప్రమైజ్ అయ్యాను చాలా విషయాల్లో..కాని నన్నో వెదవను చేసి నాజీవితంనుంచి తప్పుకుంది..కనీసం నాతో పలుకరించలేనంత గా..తన స్నేహితులూ అంతే ఎందుకిలా వింతగా ప్రవరిస్తున్నారు...స్వార్దంగా ఆలోచిస్తున్నారు...నేను మాత్రం మారలేదు మారను ..ఓ వెదవను చేసి తన సుఖం చూసుకొంది..ఇలా ముందే నిర్నయించుకు0టే పోయేది నాజీవితంలో కి ఎందుకు ప్రచేసించిందో ఎందుకు వెళ్ళిఫోయిందో తెలీదు ప్రపంచంలో నన్ను తప్ప అందర్నీ నమ్ముతుంది...ఎందుకో తెలీదు..ఒకప్పుడు అలా లేదు నేనే ప్రపంచం అన్నట్టుంది...అంతలోనే అంత మార్పా..ఇలా ఎలా మారతారు..ఎందుకు మారతారు..బ్రతకాలన్న ఆశ తనవల్లే చచ్చిపోయింది..ఈ విషయం తనకీ తెల్సు కాని ఏమాత్రం చలనం లేదు ఈ పని ఎప్పుడు జరుగుతుందాని నా చావుకోసం ఎదురు చూస్తుంది గ్రేట్ పర్సన్ కదా..?

    ReplyDelete
  2. మనిషిగా తను నన్ను ఎప్పుడో చంపేసింది..నేను ఏది వద్దనుకున్నానో అదే చేస్తుంది అన్నీ నాకు తెల్సు .. నాకిలా జరిగింది ..నాలా ఇంక ఎవ్వరికీ జరుగకూడదు అని కోరుకుంటున్నా ఇదే నా ఆఖరికోరిక తన సుఖం చూసుకొని నన్ను ఇలా చేసింది ...ఏమైనా తను హేపీగా ఉండాలని ఇప్పటీకీ కోరుకుంటున్నా నేను ఏమైనా పట్టించుకునే స్థితిలో లేదు

    ReplyDelete
  3. @నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి....
    manasu unnaka...manaspardhalu vache teerutayi...
    manushyulannaka raka, rakkaluga untaru...
    yedi yemynaa boys v girls.... anthe...ilage jarugutayi!
    Boys separate...
    Girls Separate...
    kalisi jeevinche PARISTHITI ledu...JAIVIKANGAA!
    Idi genetical prblm!!
    kaneesam...ippudunna SAMAJA NIRMANAMLO ayina..., valla ayinaa ee "SAHA JEEVANAM" FAIL ayyindi...
    idi nenu 2 dashaabdhaaluga research chesi telusukunna vishayam...and, SWAYANGAA FACE CHESTUNNA SWAANUBHAVAM luda!!
    So Dhyryangaa jeevinchandi....
    PUTTETAPPUDU...ONTARIGANE PUDATAMU!
    POYETAPPUDUU... ONTARIGANE POTAAMUU!!
    MADHYALO MATRAM EVROOOO KAAVAAALANI ENDUKU BADHA PADATAM???
    JEVITAANANDAM DORIKINDAA OKAY!
    LEDA...DAANIKI MANAM DORAKA VADDU!
    THATS IT!

    ReplyDelete
  4. Hmmm....

    I understand the pain in love.
    The only WORLD where you get this is in LOVE.

    But.... ????

    CAN WE THINK OUT OF BOX???

    OUT OF BOX thinking makes lot of difference in the way of thinking and the way of understanding the situations/WORLD.

    HOPE THE BEST... THINK POSITIVE...

    ReplyDelete
  5. మనసు కన్నా గొప్ప కాంట్ర డిక్చన్ లేదు!
    జీవితం పియానో మెట్ల మీద
    ఎంత స్వార్ధం ట్యూన్ వాయించినా
    పాట మాత్రం.. ప్రేమించే మరొక మనసు కోసమే!!

    ReplyDelete