Monday, February 14, 2011

మళ్లీ జన్మిస్తా........



ఎన్నో హృదయాలు...
ఒక దాని కోసం ఒకటి కొట్టుకున్నాయి.
ఈ ఒక్క రోజైనా కొంత మంది మనుష్యులు...
                                       మళ్లీ పుట్టారు!
పాత జ్ఞాపకాలను, విషాద ప్రేమ చేదు జాతకాలను...
                             సమాధి చేశారు కొంత మంది!
 ఆ సమాధి శిధిలాలను తొలగించి, మొలకలను మొలిపించారు.
మరి కొంత మంది....కొత్త నీరు పోసి మళ్లీ ప్రేమను చిగురెత్తించారు .

ప్రేమ...
మీరు ఎన్ని సార్లు చంపితే... అన్ని సార్లు పుడతా...
ఎన్ని సార్లు చచ్చిపోయినా మళ్లీ జన్మిస్తా...మళ్లీ మళ్లీ జన్మిస్తా!
...అని మళ్లీ, మళ్లీ మన మధ్యకు వస్తూనే ఉంది.
ప్రేమ కోసం... కొంతమంది ఎన్నో సార్లు మరణిస్తున్నారు. 
ప్రేమ కోసం... కొంతమంది మళ్లీ, మళ్లీ జన్మిస్తున్నారు.
ప్రేమ కోసం... పాతబడ్డ ప్రతి సారీ మరణిస్తుంది ప్రేమ!
ప్రేమ కోసం...కొత్తగా మళ్లీ, మళ్లీ జన్మిస్తుంది ప్రేమ!!  
ఎన్నో సారో తెలియదు కానీ....ఈ రోజు ప్రేమ మళ్లీ పుట్టింది!!!
(ప్రియురాలి/ప్రియుడి హృదయం తెరుచుకున్నా...సమాజం తలుపులు తెరుచుకోని...ప్రేమికులకు....సగౌరవంగా...అంకితం!)

No comments:

Post a Comment