Friday, July 30, 2010

ప్రేమ బాధ


ప్రేమయినా దోమయినా
కుట్టాలీ ఏడవాలి.
దోమ బాధలు చాలా రకాలుగా ఉండొచ్చేమో కానీ
ప్రేమ బాధ ఒకే పోటు పొడుస్తుంది.
కృష్ణ శాస్త్రి బాధ ప్రపంచానికి బాధ,
ప్రపంచం బాధ శ్రీ శ్రీ బాధ!

(పాతగా ఉంది కదా, ఇంత కన్నా గొప్పది లేదు ...పోలిక )
నీతో నా దోమ బాధలు నాకు ఉండగానే
ఇలా ప్రేమించు , అలా ప్రేమించు అంటూ
చలం
గోల పెడుతున్నాడు
అందులో ఆయన తప్పేమీ లేదు
మరి ఆ రోజుల్లో... అంత బూస్టప్ ఉంటే తప్ప
బావిలో కప్పలు బయట పడేవి కాదు.
ఇప్పుడయినా, మన స్విమ్మింగ్ ఫూల్సుల్లో మనం
విశాల హృదయాలతో ఫూల్స్ అవుతూనే ఉన్నాం కదా
ఇందులో మన తప్పు కూడా ఏమీ లేదు
మనం పుట్టిన చోట ప్రేమ సముద్రాలు లేవు మరి!
నడినెత్తిన సూర్యుడు మండిపోతుంటే..
గోరు వెచ్చని ఊహల కోసం తహ తహ లాడలేము కదా
...సూర్యుడి నెత్తిన వర్షం ముసురు ముసుగు కప్పినప్పుడు...
నులివెచ్చని తలపుల తోటకు తలుపులు తెరుచుకుంటాయి ...
వర్షం తోటలో ముందు దోమ కుడుతూంది తర్వాత ప్రేమ కుడుతూంది...
... బాధ ...
ఇది శాస్త్రి గారి బాధ కాదు శ్రీ శ్రీ బాధాకాదు
చలం బాధ అంతకన్నా కాదు
ఇది ఇక మన బాధ
మనిద్దరి ప్రేమ బాధ!
నువ్వున్నావని తెలియడమే నాకు బాధ
నేనున్నానని తెలియక పోవడమే నీకు తెలిసీ తెలియని బాధ

కలలో నువ్వు ఎదురయినప్పుడు...
నిన్ను గిల్లో, గిచ్చో నా ఉనికి నిజమని నీకు తెలుపకపోవడం
నా తప్పే !
నీ జంటన తున్టరినై , అంతలోనే ఒంటరినై ....
సమ శీతోష్ణ స్థితే ప్రేమకు చక్కని స్థలమని....
సూర్య, చంద్రులను కళ్ళు చేసుకుని,
ఆ వేల వెలుగులతో పగలూ, రాత్రుల హద్దులు మరచి
వెచ్చని ఊహల ముసుగు కప్పుకుని,
నీ కోసం ఎదురుచూస్తున్నాను................

No comments:

Post a Comment